కనులున్నా కాన లేని - kanulunna kanaleni song lyrics

కనులున్నా కానలేని - చెవులున్నా వినలేని (2) 
మనసున్నా మతి లేని - స్థితియున్న గతి లేని (2) 
వాడను యేసయ్యా - ఓడిపోయిన వాడను (2) 

అన్నీ ఉన్నా ఏమి లేని - అందరూ ఉన్న ఏకాకిని 
దారి ఉన్నా కాన రాని - చెంతనున్న చేరలేని ,(2)
యేసయ్యా .. నన్ను విడువకయ్యా (2) 
దిక్కు లేని వాడను 
వాడను యేసయ్యా .. చెదరి పోయిన గూడును (2) 
                                                  " కనులున్నా " 

భాషలున్నా భావము లేని - ఆత్మ ఉన్న అవివేకిని 
భక్తి ఉన్న శక్తి లేని - ప్రార్ధన వున్నా ప్రేమ లేని 
యేసయ్యా  .. నన్ను కరుణించుమా (2) 
ఫలము లేని వాడను 
వాసిని యేసయ్యా - పేరుకు మాత్రమే విశ్వాసిని (2) 
                                                " కనులున్నా " 
బోధ ఉన్నా బ్రతుకు లేని - పిలుపు ఉన్నా ప్రయాసపడని
సేవ ఉన్నా సాక్ష్యము లేని - సంఘమున్నా ఆత్మలు లేని 
యేసయ్యా నన్ను నింపుమయా (2)
ఆత్మ లేని వాడను 
పాదిరిని యేసయ్యా - మాదిరి లేని కాపరిని (2) 
                                               " కనులున్నా " 

Comments

Popular Posts