కళ్యాణమే వైభోగమే - kalyaaname vaibhogame song lyrics

కల్యాణమే వైభోగమే - పరిణయమే మరి పెళ్లి సంబరమే 
అందాల వరుడు పరిశుద్ధుడు - చక్కని వధువు కన్యకు 
జరిగే పరిశుద్ధ వివాహమే - పెరిగే నిరంతర సంతోషమే (2)

ప్రేమను పంచుకునే తోడుకై - ఆశగా చూసే హృదయముకు
దేవుని దీవెనలే కురియగా - 
ఆమని కుసుమములే విరియగా 
ముగిసే నిరీక్షణ సమయమే - 
మురిసే ప్రియమైన హృదయమే 
యేసే ఏర్పరచిన దినమే - మన కన్నులకు ఆశ్చర్యమే 
                                                      " కళ్యాణ " 

మరణము తప్ప మరి ఏదియు - విడదీయనీది ఈబంధము 
వ్యాధి బాధ సంతోషం లో - కలిమి లేమి ఆరోగ్యం లో 
ప్రభువే ఒక్కటిగా దీవించెను - మనులే అందుకు నియమించెను 
పరలోకము లో నిర్ణయించెను - నర లోకము లో ఏర్పరచెను                                    " కళ్యాణ " 

Comments

Popular Posts