కన్నీరెలమ్మా - kanneerelamma song lyrics

కన్నీరెలమ్మా 
కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా 
కలవరపడకమ్మా 
కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా
కరుణ చూపి - కలత మాన్పే (2) 
యేసే తోడమ్మా

చరణం 2
నీకేమి లేదని ఏమి తేలేదని 
అన్నారా నిన్ను అవమాన పరిచారా 
తలరాత ఇంతే నని తరువాత ఏమౌనని 
రేపటి గూర్చి చింతించుచున్నావా (2)
చింతించకన్నా యేసు మాటను మరిచావా 
మారాను మధురం గా మార్చెను చూసావా (2)  " కన్నీ"

చరణం 2
నీకేవరు లేరని ఏం చేయలేవని 
అన్నారా నిన్ను అవమాన పరిచారా
పురుగంటి వాడనని ఎప్పటికీ ఇంతేనని 
నా బ్రతుకు మారదు అని అనుకుంటూ ఉన్నావా (2)
నేనున్నానన్న యేసు మాటను మరిచావా 
కన్నీరు నాట్యం గా మార్చును చూస్తావా (2)       " కన్నీ "









Comments

Popular Posts