కళ్ళల్లో కన్నీరెందుకు - kallallo kannerenduku song lyrics

కళ్ళల్లో కన్నీరెందుకు గుండెల్లో దిగులెందుకు 
ఇక నీవు దిగులు చెందకు ... 
నెమ్మది లేకున్నదా గుండెల్లో గాయమైనదా 
ఇక అది ఉండబోదుగా ... 
యేసే నీ రక్షణ - యేసే నిరీక్షణ (2)          " కళ్ళల్లో " 

చరణం : 
హోరు గాలులు వీచగా - తుఫానులే చెల రేగగా 
మాట మాత్రము సెలవియ్యగా నిమ్మలమాయేనుగా (2)
యేసే నీ నావిక - దిగులు చెందకు నీవిక 
యేసే నీ రక్షణ - భయము చెందకు నీవిక    " కళ్ళల్లో "

చరణం : 
కరువు ఖడ్గము లొచ్చినా - నిందలే నిను చుట్టినా 
లోకమంతా ఏకమైన - కలత చెందకుమా (2) 
యేసే నీ రక్షణ - భయము చెందకు నీవిక 
యేసే విమోచన - సంతసించును నీవిక    " కళ్ళల్లో " 







Comments

Popular Posts