ఒంటరిగా నేనున్న - ontariga nenunna song lyrics

ఒంటరిగా నేనున్నా - ఎవరు లేక పోయినా
ఆశలన్నీ కోల్పోయినా - అనాధగానే మిగిలినా 
నీవే నా సర్వం - నీవే నా ఆధారం         " ఒంటరి " 

చరణం 1:
ఎవరు లేని జీవితం లో - నా తోడుగా ఉన్నావు 
ఎవరు రాని ఈ పయనం లో - నా తోడుగా నడిచావు 
నీవే నా జీవం నీవే నా గమ్యం             " ఒంటరి " 

చరణం 2:
శ్రమలెన్నో తరుముచున్ననూ - నా సహాయమైనావు 
రోగము నను వేధించినను - నాకు స్వస్థతనిచ్చావు
నీవే నా ధైర్యం నీవే నా ప్రాణం            " ఒంటరి " 

చరణం 3: 
స్నేహితులే అవమానించిన - నీ ప్రేమను చూపావు
బంధువులే ద్రోహం చేసిన - నీ దీవెనలనిచ్చావు
నీవే నా స్నేహం - నీవే నా సైన్యం         " ఒంటరి " 

Comments

Popular Posts