కరుణించవా దేవా - karuninchava deva song lyrics

కరుణించవా దేవా - కరుణాత్ముడా రావా 
నీ ప్రేమ లోనే  - కావుమా
శ్రమ లోన తోడే లేక - శిలనైన కానే కాక 
వేసారి పోయా యేసయ్యా 
పిలిచాను నిన్నే దేవా - కడదాక నాతో రావా 
నా జీవ దాత యేసయ్య                   " కరుణించవా " 

ఆశే నీవై నాలో - నా జీవ గమనము లోన 
దారే చూపే నాకు - నీ వాక్య వెలుగుల లోన 
నీలో నివాసమే - నాలోని కోరిక 
నీ స్నేహ బంధమే -  సంతోష కానుక 
నీలో నిరీక్షణే - నా మౌన గీతిక 
కాలాలు మారిన నీవుంటే చాలిక      " కరుణించవా " 

నీ ప్రేమే నాపై చూపి - నా చేయి విడువని దేవా 
ధైర్యం నాలో నింపి - నా తోటి నడిచిన దేవా 
నీ సత్య మార్గమే - నా జీవ బాటగా 
నీ నామ ధ్యానమే - నా లోని శ్వాసగా 
నీలోనే ఏకమై - నీ ప్రేమ సాక్షి నై 
సాగాలి యేసయ్య - నా జీవితాంతము 
                                                 " 

Comments

Popular Posts