ఎవరికి ఎవరో ఈ లోకం లో - evariki evaro song lyrics

ఎవరికి ఎవరో ఈ లోకము లో 
చివరికి యేసే పరలోకము లో (2) 

చరణం : 
ఎవరెవరో ఎదురవుతుంటారు
ప్రాణానికి నా ప్రాణం అంటారు (2)
కష్టాలలో వారు కదలి పోతారు 
కరుణ గల యేసు నీతో ఉంటాడు (2)      " ఎవరికి " 

చరణం : 
ధనము నీకుంటే అందరూ వస్తారు 
దరిద్రుడ వైతే దరికెవ్వరు రారు (2)
ఎవరిని నమ్మిన ఫలితం లేదురా 
యేసుని నమ్మిన మొక్షముంది రా (2)     " ఎవరికి " 

చరణం : 
మనుష్యుల సాయం వ్యర్థమురా 
రాజుల నమ్మిన వ్యర్ధమురా (2) 
యెహోవా ను ఆశ్రయించుట 
ఎంత మేలు ఎంతో మేలు (2)              " ఎవరికి " 


Comments

Popular Posts