ఎవరికి ఎవరో ఈ లోకం లో - evariki evaro song lyrics
ఎవరికి ఎవరో ఈ లోకము లో
చివరికి యేసే పరలోకము లో (2)
చరణం :
ఎవరెవరో ఎదురవుతుంటారు
ప్రాణానికి నా ప్రాణం అంటారు (2)
కష్టాలలో వారు కదలి పోతారు
కరుణ గల యేసు నీతో ఉంటాడు (2) " ఎవరికి "
చరణం :
ధనము నీకుంటే అందరూ వస్తారు
దరిద్రుడ వైతే దరికెవ్వరు రారు (2)
ఎవరిని నమ్మిన ఫలితం లేదురా
యేసుని నమ్మిన మొక్షముంది రా (2) " ఎవరికి "
చరణం :
మనుష్యుల సాయం వ్యర్థమురా
రాజుల నమ్మిన వ్యర్ధమురా (2)
యెహోవా ను ఆశ్రయించుట
ఎంత మేలు ఎంతో మేలు (2) " ఎవరికి "
Comments