ఏం చేశనయ్యా నీకోసం - em chesaanayya nekosam song lyrics

ఏం చేశానయ్యా నీకోసం ఈ బ్రతుకునిచ్చావని 
ఏం మోశానయ్యా నీకోసం నీవు నన్ను చూశావని (2) 
ఒక్కరినైనా ఒక ఆత్మనైనా 
రక్షించానా నీకై వెలిగించా నా (2) 

చరణం : 
ప్రాణమిచ్చావయయ్యా - బుద్ధినిచ్చావయ్యా 
మాటలిచ్చావయ్యా నాకు బ్రతుకు నేర్పావయ్యా (2)
ఎన్ని ఇచ్చినా నిన్నే నేను ఘనపరిచానా 
నిన్నే ఎదిరించానా (2) 
ఇప్పటికైనా నీకోసం నే కష్టపడతానయ్యా (2)
నాకున్న వన్ని నీ పనిలో వాదనిస్తానయ్యా (2) " ఇప్పటి "

చరణం : 
ధనమునిచ్చావయ్యా ఘనత నిచ్చావయ్యా (2)
శ్రద్ధ నిలిపావయ్యా పోషింప జేశావయ్య (2)
ఎన్ని ఇచ్చిన నీకై నేను ఖర్చయ్యానా 
నా కడుపు నింపుకున్నానా (2)                " ఇప్పటి " 

చరణం : 
ఇల్లు నిచ్చావయ్యా వాహనమునిచ్చావయ్యా 
భాగ్య మిచ్చావయ్యా నాకు సుఖమునిచ్చావయ్యా (2) 
ఎన్ని ఇచ్చినా నీకై నేను కష్టించానా 
సోమరినై పోయానా (2)                         " ఇప్పటి " 

Comments

Popular Posts