దీవించావే సమృద్ధిగా - deevinchave samruddhiga song lyrics

దీవించావే సమృద్ధి గా 
నీ సాక్షిగా కొనసాగమని
ప్రేమించావే నను ప్రాణం గా 
నీ కోసమే నను బ్రతకమని 

దారులలో ఎడారులలో 
సెలయేరు లై ప్రవహించుమయా 
చీకటిలో కారు చీకటి లో 
అగ్ని స్తంభమై నను నడుపుమయా    " దీవించావే " 

చరణం : 
నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా 
నీ ప్రేమే లేకుండా జీవించాలేను నేనయ్యా
నా ఒంటరి పయనం లో నా జంట గా నిలిచావే 
నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే (2) 
ఊహలలో నా ఊసులలో 
నా ధ్యాస బాసవైనావే 
శుద్ధతలో పరిశుద్ధత లో
నిను పోలి నన్నిలా సాగమని           " దీవించావే " 

కొలతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా 
కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా 
నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా 
కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా (2)
ఆశలలో .. నిరాశలలో  ..
నేనున్నా నీకున్నా అన్నావే  ... 
పోరులలో .. పోరాటములో .. 
నా పక్షముగానే నిలచావే ...          " దీవించావే " 








Comments

Anonymous said…
Water

Popular Posts