యేసయ్యా నిన్ను చూడాలని ఆశ - yesayya ninnu chudalani asha song lyrics

ఎవరు ఉన్నారు నాకు ఈ లోకం లో 
ఎవరు ఉంటారు తోడు నా జీవితమందు 
ఇమ్మానియేలైన నా దైవం నీవే గా (2) 

యేసయ్యా నిన్ను చూడాలని ఆశ 
మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ (2) 

చరణం (1)
అందరూ ఉన్నారని ... అందరూ నా వారని ... (2)
తలచితిని భ్రమచితిని 
చివరికి ఒంటరి నేనైతిని (2) 
నా గానం నీవయ్యా నా ధ్యానం నీవయ్యా 
నా ప్రాణం నీవయ్యా నా సర్వం నీవయ్యా   " యేసయ్యా"

చరణం (2)
అంధకారము లో అంధుడ నేనైతిని 
నిను చూసే నేత్రములు నా కొసగుమా నజరేయుడా (2) 
నా ఆశ నీవయ్యా నా ధ్యాస నీవయ్యా 
నా భాష నీవయ్యా నా శ్వాస నీవయ్యా (2) "యేసయ్యా "





Comments

Popular Posts