ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము - evari kosamo ee prana thyagamu song Lyrics

ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము (2) 
నీ కోసమే నా కోసమే 
కలువరి పయనం ఈ కలువరి పయనం (2)   " ఎవరి " 

ఏ పాపము ఎరుగని నీకు - 
ఈ పాప లోకమే సిలువ వేసిందా
ఏ నేరము తెలియని నీకు - 
అన్యాయపు తీర్పునే ఇచ్చిందా  (2) 
మోయలేని మ్రానుతో మోము పైన ఉమ్ములతో 
నడువలేని నడకలతో తడబడుతూ పోయావా 
సోలి వాలి పోయావా (2) ..                       " ఎవరి " 

జీవ కిరీటం మాకు ఇచ్చావు - 
ముళ్ల కిరీటం నీకు పెట్టాము 
జీవ జలములు మాకు ఇచ్చావు - 
చేదు చిరకను మీకు ఇచ్చాము      
మా ప్రక్కన ఉండి మమ్ము కాపాడుచుండగా 
నీ ప్రక్కలో బల్లెముతో - ఒక్క పొటు పొడిచితిమి 
                                                            " ఎవరి " 
  



     



Comments

Popular Posts