ఎబినేజరే - ebinejare song lyrics

నేనును నా ఇంటి వారందరు 
మానక స్తుతించెదను (2) 
నీ కను పాప వలే నన్ను కాచి 
నేను చెదరక మోసావు స్తోత్రం (2)

ఎబినేజరే ఎబినేజరే 
ఇంతకాలం కాచితివే 
ఎబినేజరే ఎబినేజరే
నా తోడు వై నడచితివే 

స్తోత్రం స్తోత్రం స్తోత్రం 
కను పాప గా కాచితివి స్తోత్రం 
స్తోత్రం స్తోత్రం స్తోత్రం 
కౌగిలిలో దాచితివి స్తోత్రం (2)

చరణం : 
ఎడారిలో ఉన్న నా జీవితమును 
మెల్ల తో నింపితివి (2)
ఒక కీడైన దరిచేరక నను 
తండ్రిగా దాచావు స్తోత్రం (2)             " ఎబినేజరే " 

చరణం : 
ఆశలే లేని నాదు బ్రతుకుని 
నీదు కృపతో నింపితివి (2)
నీవు చూపిన ప్రేమ ను పాడగా 
పదములు సరిపోవు తండ్రి (2)        " ఎబినేజరే " 








Comments

Anonymous said…
Ebinejare

Popular Posts