యావే నీవే నా దైవము - yaave neve naa daivamu song lyrics

భయము లేదు దిగులే లేదు 
నా జీవితమంతా ప్రభు చేతిలో 
నిరాశ నేనెన్నడూ ముట్టలేదు 
నిరీక్షణ తో అనుదినం సాగెదను     (2)

యావే నీవే నా దైవము 
తరతరముల వరకు .. 
యావే నీవే నా ఆశ్రయం 
తరతరముల వరకు .. 
నీవు కునుకవు  నీవు నిద్ర పోవు 
ఇశ్రాయేలీయులను కాపాడువాడు (2)

మరణ భయం అంతా పోయెను 
శతృభీతి అంతా తొలగించెను (2)
మరణమును జయించి శత్రువును ఓడించిన
సర్వాధికారివి నా దేవా (2)                          " యావే " 

ఓటమిని అంతా తీసి వేసి 
రోగాన్ని అంతా మాన్పివేసి (2)
జయ శీలుడవు పరమ వైద్యుడవు 
సర్వశక్తుడవు నా రక్షకా (2)                         " యావే " 









Comments

Popular Posts