ఎంత మంచి దేవుడవయ్యా - entha manchi devudavayya song lyrics
ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా
చింతలన్నీ తీరేనయ్యా నిను చేరిన
నా .. చింతలన్ని తీరేనయ్యా నిను చేరిన (2)
సంతోషం ఎక్కడ ఉందనీ
సమాధానమెచట నాకు దొరికేనని (2)
జగమంతా వెదికాను జనులందరినడిగాను (2)
చివరికది నీలోనే కనుగొన్నారు (2) " ఎంత "
ప్రేమనేది ఎక్కడ ఉందని
క్షమ అనేది ఎచట నాకు దొరికేనని (2)
జగమంతా వెదికాను జనులందరినడిగాను (2)
చివరికది నీలోనే కనుగొన్నాను (2) " ఎంత "
సత్యమనేది ఎక్కడ ఉందనీ
నిత్య జీవమెచట నాకు దొరికేనని (2)
ఎందరికో మొక్కాను ఏమేమో చేశాను (2)
చివరికది నీలోనే కనుగొన్నాను (2) " ఎంత "
Comments