ఎంత మంచి దేవుడవయ్యా - entha manchi devudavayya son Lyrics

ఎంత మంచి దేవుడవయ్యా 
ఎంత మంచి దేవుడవేసయ్యా
చింతలన్నీ తీరేనయ్యా నిను చేరగా 
ఎంత మంచి దేవుడవేసయ్యా .. నా...  (2) 

ఘోర పాపినైన నేను .. 
దూరం గా పారిపోగా (2)
నీ ప్రేమ తో నను క్షమియించి 
నను హత్తుకున్నావయ్యా .. (2)       " ఎంత "

నాకున్న వారందరూ 
నను విడచి పోయిననూ .. (2)
ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినా 
నను నీవు విడువ లేదయ్యా..  (2)   " ఎంత "

నీవు లేకుండా నేను 
ఈ లోకంలో బ్రతుకలేనయ్యా .. (2)
నీతో కూడా ఈ లోకం నుండి 
పరలోకం చెరెదనేసయ్యా.. (2)       " ఎంత " 





Comments

Popular Posts