ఎంత దీనాతిదీనమో - entha dheenathi dheenamo song lyrics
ఎంత దీనాతిదీనమో ఓ యేసయ్యా
నీ జననమెంత దయనీయమో
తలుచుకుంటే నా గుండె తడబడి
కరిగి కరిగి నీరగుచున్నది
ఈ సృష్టిలో ఈ లోకమే
నీవు నాకు ఇచ్చిన సత్రమయ్యా (2)
ఆ సత్రములో ఓ యేసయ్యా
నీకు స్థలమే దొరకలేదయ్యా (2) " ఎంత "
నిండు చూలాలు మరియమ్మ తల్లి
నడవలేక సుడివడి పోయెనయ్యా (2)
పసికందువై ఓ యేసయ్యా
తల్లి వడిలో ఒదిగినావయ్యా (2) " ఎంత "
చల్ల గాలిలో చాటు లేక
నలుమూలలా చలి పుట్టెనయ్యా (2)
దిక్కు తోచక ఓ యేసయ్యా
పశులపాకలో ప్రసవించెనయ్యా (2) " ఎంత "
Comments