ఎంత దీనాతిదీనమో - entha dheenathi dheenamo song lyrics

ఎంత దీనాతిదీనమో ఓ యేసయ్యా 
నీ జననమెంత దయనీయమో 
తలుచుకుంటే నా గుండె తడబడి
కరిగి కరిగి నీరగుచున్నది 

ఈ సృష్టిలో ఈ లోకమే
నీవు నాకు ఇచ్చిన సత్రమయ్యా (2)
ఆ సత్రములో ఓ యేసయ్యా 
నీకు స్థలమే దొరకలేదయ్యా (2)       " ఎంత " 

నిండు చూలాలు మరియమ్మ తల్లి 
నడవలేక సుడివడి పోయెనయ్యా (2)
పసికందువై ఓ యేసయ్యా 
తల్లి వడిలో ఒదిగినావయ్యా (2)    " ఎంత " 

చల్ల గాలిలో చాటు లేక 
నలుమూలలా చలి పుట్టెనయ్యా (2)
దిక్కు తోచక ఓ యేసయ్యా 
పశులపాకలో ప్రసవించెనయ్యా (2) " ఎంత " 






Comments

Popular Posts