ఎన్ని తలచిన - enni thalachina song lyrics
ఎన్ని తలచినా ఏది అడిగినా
జరిగేది నీ చిత్తమే - ప్రభువా
జరిగేది నీ చిత్తమా (2)
నీ వాక్కుకై వేచి యుంటిని
నా ప్రార్థన ఆలకించుమా - ప్రభువా
నా ప్రార్థన ఆలకించు మా (2)
నీ తోడు లేక నీ ప్రేమ లేక
ఇళలోన ఏ ప్రాణి నిలువలేదు (2)
అడవి పూవులే నీ ప్రేమ పొందగా (2)
నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా
నా ప్రార్థన ఆలకించుమా (2) " ఎన్ని "
నా ఇంటి దీపం నీవే అని తెలిసి
నా హ్రుదయం నీ కొరకు పదిల పరచితి (2)
ఆరిపోయిన నా వెలుగు దీపము
వెలిగించుము నీ ప్రేమ తో - ప్రభువా
వెలిగించుము నీ ప్రేమ తో " ఎన్ని "
ఆపదలు నన్ను వెన్నంటియున్న
నా కాపరి నీవై నన్నాదుకొంటివి (2)
లోకమంతయు నన్ను వడచిన (2)
నీ నుండి వేరు చేయవు - ప్రభువా
నీ నుండి వేరు చేయవు (2) " ఎన్ని "
Comments