ఎందుకో నన్నింతగా నీవు - enduko nanninthaga neevu song lyrics
ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా
అందుకో నా దీన స్తుతి పాత్ర
హల్లెలూయ యేసయ్యా (2)
నా పాపము బాప - నర రూపివైనావు
నా శాపము బాప - నలిగి వ్రేలాడితివి (2)
నాకు చాలిన దేవుడవు నీవే
నా స్థానము లో నీవే (2) ..
హల్లెలూయ యేసయ్య (2) " ఎందుకో "
నీ రూపము నాలో - నిర్మించియున్నావు
నీ పోలిక లోనే - నివసించుచున్నావు (2)
నీవు నన్ను ఎన్నుకొంటివి - నీ కొరకే నీ కృపలో (2)
హల్లెలూయ యేసయ్య.. (2) " ఎందుకో "
నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు
నా వ్యధలు భరంచి నన్నాదుకున్నావు (2)
నన్ను నీలో చుచుకున్నావు
నను దాచియున్నావు (2)
హల్లెలూయ యేసయ్య... (2) " ఎందుకో "
Comments