ఎందుకని నేనంటే - endukani nenante song lyrics

ఎందుకని నేనంటే ఇంత ప్రేమ 
దేనికని నా పైన ఇంత కరుణ 
జడివాన లోయలో - ఎదురీత బాటలో 
ఎన్నడూ వీడని దైవమా యేసయ్య       " ఎందుకని " 

ఆశ చూపే లోకం - గాయాలు రేపెనే 
గాలి వానై నాలో - నను కృంగదీసెనే 
మాతృ మూర్తి నీవై - లాలించే నన్నిలా 
ఆదరించసాగే - నీ ప్రేమ వెన్నెల 
క్షణమైనా - యగమైనా - నీ మమతే కను పాపలా 
                                                     " ఎందుకని " 

మోయలేని భారం - నీపైన మోపగా 
ఆరిపోదు దీపం -  నీ చెంత నుండగా 
ఎండ మావియైనా -  నీ ప్రేమ చాలుగా 
ఎంత దూరమైనా -  నా తోడు నీవెగా
కలనైనా - ఇలనైనా -  నీ కృపలో కాపాడవా 
                                                   " ఎందుకని " 







Comments

Popular Posts