ఎందుకమ్మ లోకమా - endukamma lokama song lyrics

ఎందుకమ్మ లోకమా యేసు అంటే కోపము 
ఏమిటమ్మ దేశమా క్రీస్తు అంటే ద్వేషము (2) 
నిను ప్రేమించినందుకా ప్రానమిచ్చినందుకా 
నీ దరి చేరినందుకా దీవించినందుకా (2)      " ఎందు " 

నిను ఎంతో ప్రేమించి నీ కొరకై ఏతెంచి 
నీ కన్నీటిని తుడిచి నీకై సిలువను మోసిన (2)
క్రీస్తు కై                                                    " ఎందు " 

తన పేరే తెలియకున్న తన గురించి తెలిపేందుకు 
తన సేవకులను పంపి తండ్రి ప్రేమ చాటిన (2) 
క్రీస్తు కై                                                    " ఎందు " 

నీలోని చీకటిని తొలగించి వేయుటకు 
తన తండ్రిని విడిచి నీ కొరకై వచ్చిన (2)
క్రీస్తు కై                                                   " ఎందు " 


Comments

Popular Posts