ఎక్కరా ఓరన్నా - ekkara oranna song lyrics

ఎక్కరా ఓరన్నా రక్షణ పడవ 
చక్కగా మోక్షానికి చేర్చేటి నావ (2)

తండ్రియైన దేవుడు నిర్మించినాడురా 
యేసు క్రీస్తు దేహాన్ని మలిచి కట్టినాడు రా (2) 
పరిశుద్ధ రక్తముతో సిద్ధమైన పడవరా (2)
దరి చేర్చ గలిగిన ఏకైక నావరా (2)                " ఎక్కరా " 

ఎందరెక్కినా దానిలో చోటుంటుందిరా 
అందరినీ ప్రేమతో రమ్మంటుంది రా (2) 
నిత్య జీవాన్నిచ్చే నిజమైన పడవరా (2) 
సత్య మైన మార్గాన సాగేటి నావరా (2).         " ఎక్కరా "

శాపాలు పాపాలు దానిలోకి చెరవురా (2)
చావు భయమే అందు మరి ఉండబోదురా (2)
శిక్ష నుండి తప్పించే మహిమ గల పడవరా (2)
అక్షయ భాజ్యమిచ్చే అనురాగ నావరా (2).    " ఎక్కరా " 


Comments

Popular Posts