ఎడబాయని నీ కృప - edabayaani nee krupa song lyrics

ఎడబాయని నీ కృప 
నను విడువదు ఎన్నటికీ 
యేసయ్య నీ ప్రేమానురాగం 
నను కాయును ప్రతీ క్షణం (2)     " ఎడబాయని "

శోకపు లోయలలో - కష్టాల కడగండ్ల లో 
కడలేని కడలి లో - నిరాశ నిస్పృహ లో (2)
అర్థమే కానీ ఈ జీవితం - ఇక వ్యర్థమని నేననుకొనగా (2)
కృపా కనికరము గల దేవా - నా కష్టాల కడలిని దాటించితివి (2)                                  " ఎడబాయని " 

విశ్వాసపోరాటములో ఎదురాయే శోధనలు 
లోకాశల అలజడి లో సడలితి విశ్వాసము లో (2) 
దుష్టుల క్షేమము నే చూచి 
ఇక నీతి వ్యర్థమని అనుకొనగా (2)
దీర్ఘ శాంతములు గల దేవా 
నా చేయి విడువక నడిపించితివి (2)     " ఎడబాయని "

నీ సేవలో ఎదురయ్యే ఎన్నో సమస్యల లో 
నా బలమును చూచుకొని నిరాశ చెందితిని (2)
భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా (2) 
ప్రధాన యాజకుడా యేసు
నీ అనుభవాలతో బలపరచితివి (2)     " ఎడబాయని " 






 







Comments

Popular Posts