రక్తం జయం song lyrics - raktham jayam song lyrics

రక్తం జయం యేసు రక్తం జయం 
సిలువలో కార్చిన రక్తం జయం 
యేసు రక్తమే జయం 
రక్తం జయం యేసు రక్తం జయం

పాపమును కడిగే రక్తం 
మనస్సాక్షి ని శుద్ధి చేసే రక్తం 
శిక్షను తప్పించే రక్తం 
అమూల్యమైన యేసు రక్తం              " రక్తం జయం " 

పరిశుద్ధునిగా చేసే రక్తం
తండ్రి తో సంధి చేసే రక్తం 
పరిశుద్ధ స్థలములో చేర్చు రక్తం 
నిష్కళంకమైన యేసు రక్తం             " రక్తం జయం "

నీతి మందునిగా చేసిన రక్తం 
నిర్దోషిగా మార్చిన రక్తం 
నిత్య నిబంధన గా చేసిన రక్తం 
నిత్య జీవమిచ్చు యేసు రక్తం         " రక్తం జయం " 

క్రయ ధనమును చెల్లించిన రక్తం 
బలులు అర్పనలు కోరని రక్తం 
నన్ను విమొచించిన రక్తం 
క్రొత్త నిబంధన యేసు రక్తం            " రక్తం జయం " 

Comments

Popular Posts