బహు సౌందర్య సీయోనులో song lyrics - bahu soundharya seeyonulo song lyrics


బహు సౌందర్య సీయోనులో 
స్తుతి సింహాసనాసీనుడా 
నా యేసయ్యా నీ ప్రేమ పరిపూర్ణమై 
నా హృదయాన కొలువాయెనే 
నను జీవింప జేసే నీ వాక్యమే 
నాకిలలోన సంతోషమే

పరిశుద్ధత లో మహనీయుడవు
నీవంటి దేవుడు జగమున లేడు 
నాలో నిరీక్షణ నీలో సంరక్షణ  
నీకే నా హృదయార్పణ                " బహు " 

ఓటమి నీడలో క్షేమము లేక 
వేదన కలిగిన వేళల యందు 
నీవు చూపించిన నీ వాత్సల్యమే 
నా హృదయాన నవ జ్ఞాపిక         " బహు " 

ఒంటరి బ్రతుకులో కృంగిన మనసుకు 
చల్లని నీ చూపే ఔషధమే
ప్రతి అరుణోదయం నీ ముఖ దర్శనం 
నాలో నింపెను ఉల్లాసమే           " బహు " 



Comments

Popular Posts