బహు సౌందర్య సీయోనులో song lyrics - bahu soundharya seeyonulo song lyrics
బహు సౌందర్య సీయోనులో
స్తుతి సింహాసనాసీనుడా
నా యేసయ్యా నీ ప్రేమ పరిపూర్ణమై
నా హృదయాన కొలువాయెనే
నను జీవింప జేసె నీ వాక్యమే
నాకిలలోన సంతోషమే
పరిశుద్ధత లో మహనీయుడవు
నీవంటి దేవుడు జగమున లేడు
నాలో నిరీక్షణ నీలో సంరక్షణ
నీకే నా హృదయార్పణ " బహు "
ఓటమి నీడలో క్షేమము లేక
వేదన కలిగిన వేళల యందు
నీవు చూపించిన నీ వాత్సల్యమే
నా హృదయాన నవ జ్ఞాపిక " బహు "
ఒంటరి బ్రతుకులో కృంగిన మనసుకు
చల్లని నీ చూపే ఔషధమే
ప్రతి అరుణోదయం నీ ముఖ దర్శనం
నాలో నింపెను ఉల్లాసమే " బహు "
Comments