జీవ ప్రధాతవు - jeeva pradhathavu song lyrics
జీవ ప్రధాతవు నను రూపించిన శిల్పివి నీవే ప్రభు
జీవన యాత్రలో అండగా నిలిచే తండ్రివి నీవే ప్రభు
జగముల నేలే మహిమాన్వితుడా నా యెడ నీ కృపను
జాలి హృదయుడా నా పై చూపిన వీడని నీ ప్రేమను
ఏమని పాడేదనూ ... ఏమని పొగడెదను ... (2)
చరణం 1:
శుభకరమైన తొలి ప్రేమను నే
మరువక జీవింప కృపనియ్యవా
కోవెల లోని కానుక నేనై
కోరిక లోని వేడుక నీవై
జత కలిసి నిలిచి జీవుంప దలచి
కార్చితివి నీ రుధిరమే
నీ త్యాగ ఫలితం నీ ప్రేమ మధురం
నా సొంతమే యేసయ్యా " జీవ ప్రధాతవు "
చరణం 2 :
నేనేమైయున్న నీ కృప కాదా
నీతో సన్నిధిని పంపవా
ప్రతికూలతలు శ్రుతి మించినను
సంధ్యా కాంతులు నిదురించినను
తోలివెలుగు నీవై ఉదయించి నాపై
నడిపించినది నీవయ్యా
నీ కృపకు నన్ను పాత్రునిగా చేసి
బలపరచిన యేసయ్య " జీవ ప్రధాతవు "
చరణం 3:
మహిమను ధరించిన యోధులతో కలిసి
దిగి వచ్చెదవు నా కోసమే
వేల్పుల లోన బహు ఘనుడవు నీవు
విజయ విహారుల ఆరాధ్యుడవు
విజయోత్సముతో అరాధించెదను
అభిషక్తుడవు నీవని
ఏనాడు పొందని ఆత్మాభి షేకముతో
నింపుము నా యేసయ్యా " జీవ ప్రధాతవు "
Comments