మదిలోన నీ రూపం - madhilona nee rupam song lyrics
మదిలోన నీ రూపం నీ నిత్య సంకల్పం
ప్రతి ఫలింప జేయునే ఎన్నడూ
కలనైనా తలంచలేదే నీలో ఈ సౌభాగ్యము
వర్ణించలేను స్వామి నీ గొప్ప కార్యాలను
నీ సాటి లేరు ఇలలో అద్వితీయుడా " మదిలోన "
చరణం 1:
ప్రతి గెలుపు బాట లోన చైతన్య స్ఫూర్తి నీవై
నడిపించుచున్న నేర్పరీ
అలుపెరగని పోరాటాలే ఊహించని ఉప్పెనలై
నను నిలువ నీయని వేళలో
హృదయాన కొలువైయున్న ఇశ్రాయేలు దైవమా
జయమిచ్చి నడిపించితివే నీ ఖ్యాతికై
తడి కన్నులనే తుడచిన నేస్తం
ఇలలో నీవే కదా యేసయ్య " మదిలోన "
చరణం 2:
నిరంతరం నీతో నే నీ అడుగు జాడల లోనే
సంకల్ప దీక్షతో సాగెద
నీతో సహజీవనమే ఆధ్యాత్మిక పరవశమై
ఆశయాల దిశగా నడిపెనే
నీ నిత్య ఆదరణే అన్నిటిలో నెమ్మదినిచ్చి
నా భారమంతా తీర్చి సేద తీర్చితివి
నీ ఆత్మలో ముద్రించితివి
నీ కొరకు సాక్షిగా యేసయ్యా " మదిలోన "
చరణం 3:
విశ్వమంతా ఆరాధించే స్వర్ణ రాజ్య నిర్మాతవు
స్థాపించుము నీ ప్రేమ సామ్రాజ్యము
శుద్ధు లైన వారికి ఫలనులిచ్చు నిర్నేతవు
ఆ గడియ వరకు విడువకు
నే వేచి యున్నాను నీ రాక కోసమే
శ్రేష్ఠమైన స్వాస్థ్యము కోసం సిద్ధపరచుమా
నా ఊహలలో ఆశల సౌధం
ఇలలో నేవెనయ్య యేసయ్యా " మదిలోన "
Comments