లంగరేసినావా నా నావకు - langaresinava naa naavaku song Lyrics
లంగరేసినావా నా నావకు
కొట్టుకొని పోకుండా నే చివరకు
లంగరేసినావా నా నావకు
పట్టు జారి పోకుండా నా బ్రతుకుకు
అలలను అదిమిపెట్టి అలజడి అనగగొట్టి
తీరం చేరే దాక నావ లోన అడుగు పెట్టి
కలవరమిడిచి పెట్టి కలతను తరిమి కొట్టి
ఊపిరి ఆగే దాకా ప్రేమ తోనే చంకబెట్టి
లోక సంద్రాన నా జీవ నౌక
అద్దరికి చేరేదాక సాగు గాక
నీ దరికి చేరే దాక సాగు గాక
చరణం : 1
చుట్టూ ఉన్న లోకం మాయదారి
మాయ సుడిగుండం
నట్ట నడి సంద్రాన పట్టి లాగే వైనం (2)
రాకాసి అలలెన్నో ఎగసి ఎగసి పడుతుంటే
ముంచేసి నన్ను చూసి మురిసి మురిసి పోతుంటే
నా ఆశలన్నీ కరిగి ఒంటరిగా నేనుంటే
నిరాశ వలలు తెంపి నిరీక్షణ తో నను పిలిచే
చూసాను నీ వైపు (2)
ఆహా ఎంత చల్లని చూపు
ఆహా ఎంత చల్లని నీ చూపు " అలలను అదిమి "
చరణం : 2
సందేహాల గాలి తుఫాను సాగ నీక ఆగుతుంటే
సత్య వాక్య జాడ లేక ఓడ బద్ధలవుతుంటే
శోధన కెరటాలే ఎగసి ఎగసి పడుతుంటే
వేదన సుడులెన్నో తరిమి తరిమి కొడుతుంటే
ఏ దారి కానరాక దిక్కు లేక నేనుంటే
నీ దారి నేనంటూ నడిచినావు నా వెంటే
చూసాను నీ వైపు (2)
ఆహా ఎంత చూపు
ఆహా ఎంత చల్లని నీ చూపు. " అలలను అదిమి "
చరణం : 3
జీవ వాక్కు చేత పట్టి నీ చిత్తాన్ని మదిన పెట్టి
జీవదాత నీదు సేవే జీవితానికర్ధమంటూ (2)
నా వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటిని తలచి
నేత్రాశ శరీరాశ జీవపు డంబాన్ని విడిచి
నిను జేరరమ్మంటూ జగమంతా నే పిలచి
క్రీస్తేసు కృపలో నిలిచి పాపపు లోకాన్ని గెలిచి
చూస్తాను నే వైపు (2)
ఊపిరి ఉన్నంత సేపు
నాలో ఊపిరి ఉన్నంత సేపు " అలలను అదిమి "
Comments
THANK YOU .