ఉత్సాహగానము చేసెదము - uthsaha ganamu chesedamu song lyrics

ఉత్సాహ గానము చేసెదము 
ఘన పరచెదము మన యేసయ్య నామమును 

హల్లెలూయా యెహోవా రాఫా 
హల్లెలూయా యెహోవా షమ్మా
హల్లెలూయా యేహోవా ఈరే 
హల్లెలూయా యెహోవా షాలోమ్    " హల్లెలూయా " 

అమూల్యములైన వాగ్ధానములు 
అత్యధికముగా ఉన్నవి 
వాటిని మనము నమ్మిన యెడల 
దేవుని మహిమను అనుభవించెదము (2)
                                                 " హల్లెలూయా "
ఆత్మీయ ఆరాధనలు జరుగుచున్నవి 
ఇవన్నీ వాగ్ధాన ఫలములే గా 
ఆత్మాభిషేకము సమృద్ధిగా పొంది 
ఆత్మీయ వరములు అనుభవించెదము 
                                                " హల్లెలూయా "
వాగ్ధాన దేశము పితరులకిచ్చిన 
నమ్మదగిన  దేవుడాయెనే 
జయించిన వారమై అర్హత పొంది 
నూతన యెరూషలేం అనుభవించెదము 
                                              " హల్లెలూయా " 


    

Comments

Popular Posts