ఊరుకో నా ప్రాణమా - uruko na pranama song lyrics

ఊరుకో నా ప్రాణమా - కలత చెందకు 
ఆనుకో ప్రభు రొమ్మున నిశ్చింత గా (2) 

ఎడారి దారిలోన కన్నీటి లోయ లోన (2)
నా పక్షమందు నిలచి నా ముందరే నడిచి 
నీ శక్తి నే చాట నన్నుంచేనే ఈ చోట 
నిన్నెరుగుటే మా ధనం ఆరాధనే మా ఆయుధం (2)

చరణం 1 : 
ఎర్ర సముద్రాలు - నా ముందు పొర్లుచున్నా 
ఫరో సైన్యమంతా - నా వెనుక తరుముచున్నా (2)
నమ్మదగిన దేవుడే - నదిపించుచుండగా 
నడి మధ్యలో నన్ను - విడిచి పెట్టునా (2)

చరణం 2: 
ఇంతవరకు నడిపించిన - దాక్షిణ్య పూర్ణుడు
అన్యాయము చేయుట - అసంభవమేగా (2)
వాగ్దాన మిచ్చిన - సర్వశక్తిమంతుడు 
ధుష్కార్యము చేయుట - అసంభవమెగా (2) 

చరణం 3 : 
అవరోధాలెన్నో - నా చుట్టూ అలుముకున్నా
అవరోధాల్లోనే - అవకాశాలను దాచెగా (2) 
యెహోవా సెలవిచ్చిన - ఒక్క మాటయైనా 
చరిత్ర లో ఎన్నటికీ - తప్పి యుండలేదుగా





Comments

Popular Posts