ఉన్నతమైన స్థలములలో - unnathamaina sthalamulalo song lyrics
ఉన్నతమైన స్థలములలో
ఉన్నతుడా మా దేవా
ఉన్నతమైన నీ మార్గములు
మాకు తెలుపుము దేవా (2) " ఉన్నతమైన "
చరణం 1 :
చెదరిపోయినది మా దర్శనము
మందగించినది ఆత్మల భారం
మరచిపోతిని నీ తొలి పిలుపు
నీ స్వరముతో మము మేలు కొలుపు
నీ ముఖ కాంతిని ప్రసరింప చేసి
నూతన దర్శనమీయుము దేవా
నీ సన్నిధిలో సాగిల పడగా
ఆతమతో మము నింపుము దేవా (2) " ఉన్నతమైన "
చరణం 2 :
పరిశోధించుము మా హృదయములను
తెలిసికొనుము మా తలంపులను
ఆయాసకరమైన మార్గము మాలో
ఉన్నదేమో పరికించి చూడు
జీవపు ఊటలు మాలోన నింపి
సెదదీర్చి బ్రతికించుమయ్యా
మా అడుగులను నీ బండ పైన
స్థిరపరచి బల పరచుము దేవా (2) "ఉన్నతమైన "
చరణం 3 :
మా జీవితమును నెస్ సన్నిధిలో
ప్రాణార్పణముగా ప్రోక్షించెదము
సజీవ యాగ శరీర ములతో
రూపాంతర నూతన మనసులతో
నీ ఆత్మకు లోబడి వెళ్లుదము
నీ కృప చేత బలపడియెదము
లోకమున నీ వార్తను మేము
భారము తోడ ప్రకటించెదము (2) " ఉన్నతమైన "
Comments