ఉన్నావు నాకు తోడుగా - unnaavu naku thoduga song lyrics

ఉన్నావు నాకు తోడుగా 
ఇమ్మానుయేలు దేవుడా (2)

షడ్రకు మెషెక్ అబేద్నెగోల తో 
అగ్నిగుండములో నీవును ఉంటివే 
నిన్ను సేవించిన దానియేలును 
సింహపు బోనులో కాపాడుకుంటివే 
నన్నిల విడువవు ఎన్నడూ మరువవు 
కంట నీరు జారనీయవు                    " ఉన్నావు "

నీకై నిలిచిన ఏలీయా భక్తుని 
కరువులో నీవే పోసించితివే 
నిన్ను ప్రార్థిoచిన హిజ్కియా రాజుకు 
ఆయుష్కాలము పొడిగించితివే 
కారుణామయుడవు - కనికర పడెదవు
చెంత చేరి ఆదరింతువు                 " ఉన్నావు " 

Comments

Popular Posts