ఉల్లసించి పాట పాడే - ullasinchi paata paade pavurama song lyrics

మృదు మధుర సుందర నారీ మణి
ఎద పవలించు నా ప్రాణేశ్వరి 
ఒక్క చూపుతో నీ వాడనైతి 
ఒక్క పిలుపుతో నీ వశమైతి 
పావురమా నా పావురమా 
నా నిర్మల హృదయమా నా పావురమా.. 

ఉల్లసించి పాట పాడే పావురమా (2)
ఓ .. ఓ .. ఓ పుష్పమా.. షారోను పుష్పమా 
వాగ్ధాన దేశపు అభిషేక పద్మమా 
లెబనోను పర్వత సౌందర్యమా 

పాలు తేనెలు పవలించి 
పరిమళ వాసనలు విరజిమ్ము 
జీవ జలాలలో విహరించి 
జీవ ఫలాలను ఫలియించు 
ఉల్లసించి పాట పాడే పావురమా (2)
నా పావురమా నా షారోను పుష్పమా 
నా పావురమా నా షాలోము పద్మమా     " ఓ పుష్పమా "

జల్దరు వాసనలు శ్వాసించి 
జగతికి జీవమును అందించు 
సంధ్యా రాగము సంధించి 
సుమధుర స్వరమును అందించు 
ఉల్లసించి పాట పాడే పావురమా 
ఉల్లసించి పాట పాడే పావురమా 
నా పావురమా నా షారోను పుష్పమా 
నా పావురమా నా షాలోము పద్మమా    " ఓ పుష్పమా " 


Comments

Popular Posts