ఊహకు అందని ప్రేమ - uhaku andhani prema song lyrics
ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ
వెలకు అందని ప్రేమ నా యేసు ప్రేమ
తరాలెన్ని మారినా యుగాలెన్ని గడిచినా
జగాన మారనిది యేసు ప్రేమ
ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ (2)
ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ
ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ " ఊహకు "
మనిషిని మనిషి ప్రేమించుటకు స్వార్ధం మూల కారణం
దేవా నీవు ప్రేమించుటకు నీ కృపే కారణం (2)
మనుషులు మారినా మమతలు మారిన
బంధాలు వీడిన యేసు ప్రేమ మారదు (2) " ఊహకు "
జీవితమంతా పోరాటం ఏదో తెలియని ఆరాటం
నిత్యం ప్రేమకై వెతకటం దొరకక పోతే సంకటం (2)
మనుషులు ప్రేమ కొంచెం ప్రేమ కు కూడా లంచం
యేసు ప్రేమ శాశ్వతం జీవితానికి సార్ధకం (2) " ఊహకు "
Comments