శ్రమలలో కృంగవలదు - sramalalo krunga valadhu song lyrics

శ్రమలలో కృంగవలదు జడి వానలో బెదరవలదు (2)
హృదయమే పగిలిన దుఃఖమే పొంగినా (2)
యేసే నీకు తోడుగా యేసే నీకు నీడగా (2)
                                                          " శ్రమలలో "
గాలి తుఫానులు సమసి పోయే 
దుఃఖ ముఖులు నాట్య మాడే 
భ్రమలు భ్రాంతి శూన్యమాయే 
పాత బ్రతుకు కొత్తదాయే 
నిలిచెనా ఎవ్వరైనా 
మేలు పొందక - యేసు ముందు (2)
మేలు పొందక - యేసు ముందు (2)         " శ్రమలలో " 

అంధకారము తొలగి పోయే 
కారు మబ్బులు కాన రాయే 
దుష్టశక్తులు దూరమయ్యే 
భయము - భీతి మౌనమయ్యే  
ఓడేనా ఎవ్వరైనా
యేసు రక్తము చేరినప్పుడు (2)
యేసు రక్తము చేరినప్పుడు (2)               " శ్రమలలో " 

Comments

Popular Posts