క్రొత్త కీర్తన పాడేద - krotha keerthana padedha song lyrics

క్రొత్త కీర్తన పాడేద -  నా యేసయ్య
స్త్రోత్ర గానము చేసేద - నా యేసయ్య
నిన్ను గూర్చి - నే పాడేద  
నీ ప్రేమ గూర్చి - నే చాటెద 
హోసన్నా హోసన్నా హోసన్నా 
హల్లెలూయా హల్లెలుయా హల్లెలూయా

నా నోటిలో నీ సాక్ష్యము 
నా మనసులో నీ ధ్యానము 
నా ఇంటి రక్షణ గానం 
నా గుమ్మములో నీ వాక్యం
నాకు ఎంతో క్షేమము
మాకు అదియే భాగ్యము    " క్రొత్త కీర్తన " 

నా గృహమే నీ ఆలయము 
నీ సన్నిధియే నా స్వాస్థ్యము 
నా బిడ్డలా స్తోత్ర గానము 
నా కుటుంబ ప్రార్ధనా సమయము 
నాకు ఎంతో క్షేమము 
మాకు అదియే భాగ్యము   " క్రొత్త కీర్తన " 

 

Comments

Shalom brother
Excellent song

Popular Posts