ఇశ్రాయేలు సైన్యములకు - israyelu sainyamulaku song lyrics

ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా (2)
నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపింపుమా (2)

సొలొమోను దేవాలయములో నీదు మేఘము రాగానే (2)
యాజకులు నీ తేజో మహిమకు నిలువలేక పోయిరి (2)

పూర్వము ప్రవక్తలలో నరుల రక్షణ ప్రకటించి (2) 
నన్ను వెదకిన వారికి నే దొరికితి నంటిని (2)

నరుల యందు నీదు ప్రేమ  క్రీస్తు ద్వారా బయలు పరచి (2)
సిలువ రక్తము చేత మమ్ము  రక్షించి  యుంటివి (2)

ఆది అపోస్తులుల పై నీ ఆత్మ వర్షము కృమ్మరించి (2)
నట్లు మాపై కుమ్మరించి మమ్ము నడిపింపుము (2)
                                              " ఇశ్రాయేలు " 
      

Comments

Popular Posts