ఇరువది నలుగురు - iruvadhi naluguru peddalatho song lyrics

ఇరువది నలుగురు పెద్దలతో
పరిశుద్ధ దూతల సమూహాలతో (2)
నాలుగు జీవుల గానంతో (2) 
స్తుతించబడుతున్న మా దేవా        " ఇరువది " 

భూమ్యాకాశము లన్నియును  
పర్వత సముద్ర జల చరముల్  (2)
ఆకాశ పక్షులు అనుదినము (2)
గానము చేయుచు స్తుతియింపన్  " ఇరువది "

కరుణారసమగు హృదయుడవు 
పరిశుద్ధ దేవ తనయుడవు  (2)
మనుజుల రక్షక కారకుడా (2)
మహిమ కలిగిన మా ప్రభువా      " ఇరువది " 

గుప్పిలి విప్పి కూర్మి తోను 
గొప్పగ దీవెనలిచ్చెదవు (2)
గొర్రెల కాపరి దావీదు (2)
అయ్యెను ఎంతో మహా రాజు    " ఇరువది " 

Comments

Popular Posts