ఇదిగో నీ రాజు - idhigo nee raju song lyrics

ఇదిగో నీ రాజు వచ్చుచుండె 
సీయోను కుమారి సంతోషించు 
యెరూషలేము కుమారి ఉల్లసించు (2)   " ఇదిగో " 

నీదు రాజు నీతితో దోషమేమియు లేకయే 
పాప రహితుడు ప్రభు వచ్చుచుండె (2)  " ఇదిగో " 

రక్షణ గల వాడుగా అక్షయుండగు  యేసుడు
ఇచ్చ తోడ యెరూషలేము వచ్చుచుండె (2)   " ఇదిగో " 

సాత్వికండు ఈ భువిన్ అత్యంత మగు ప్రేమతో 
నిత్య రాజు నరులకై వచ్చుచుండె  (2)    " ఇదిగో " 

దీనవరుడు నీ ప్రభు ఘనత కలిగిన దేవుడు 
ప్రాణ మీయ పాపులకై వచ్చుచుండె (2)  " ఇదిగో " 

ఇలను గాడిద నెక్కియే  బాలుర స్తోత్రములతో 
బాలుడగు నీ ప్రభు వచ్చుచుండె  (2)    " ఇదిగో " 

దావీదు కుమారుడు దేవుడు పాపులకు 
జయగీతములతో వచ్చుచుండె (2)      " ఇదిగో " 

యేసుని ప్రేమించుచు హోసన్నా పాడెదము 
యేసు ఇల వచ్చుచుండె హల్లెలూయ వచ్చుచుండె (2)
                                                      " ఇదిగో " 



Comments

Popular Posts