ఇదే నా హృదయ వాంఛన - idhe naa hrudhaya vanchana song lyrics

ఇదే నా హృదయ వాంఛన 
నీవే నా హృదయ స్పందన (2)
నిన్ను చూడాలని నిన్ను చేరాలని (2)
నా బ్రతుకు నీలో నే సాగని                " ఇదే నా " 

నీ యందు నిలిచి ఫలియించాలని 
నీ అడుగు జాడలోనే నడవాలని  (2)
ఈ లోక  ఆశలన్నీ విడవాలని  (2)
నీ సువార్తను ఇలలో చాటాలని 
ఆశతో నీ కొరకై నే వేచియుంటిని (2)
యేసయ్యా యేసయ్యా నా ప్రాణం నీవయ్యా  
నీకన్నా ఈ లోకానా నా కెవరున్నారయ్యా (2) " ఇదే నా " 

ప్రతి వారు నీ వైవు తిరగాలని 
ప్రతి వారి మోకాలు వంగాలని  (2)
ప్రతి నాలుక నిన్నే స్తుతియించాలని (2)
ప్రతి ఆత్మ ప్రార్ధన లో నిండాలని 
ఆశతో నీ కొరకై నే వేచియుంటిని (2)
యేసయ్యా యేసయ్యా నా ప్రాణం నీవయ్యా 
నీకన్నా ఈ లోకాన నాకెవరున్నారయ్యా (2)    " ఇదే నా "

ప్రతి చోట నీ పాట పాడాలని 
ప్రతి చోట నీ సువార్త చేరాలని  (2)
ప్రతి వారికి రక్షణ కావాలని (2)
ప్రతి వారు నీ సన్నిధి చేరాలని  
ఆశతో నీ కొరకై నే వేచియుంటిని (2)
యేసయ్యా యేసయ్యా నా ప్రాణం నీవయ్యా 
నీకన్నా ఈ లోకన నాకెవరున్నారయ్యా (2)   " ఇదే నా " 







Comments

Popular Posts