అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము - athi parishuddhuda song Lyrics

అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము
నీకే అర్పించి కీర్తింతును 
నీవు నా పక్షమై నను దీవించగా 
నీవు నా తోడువై నను నడిపించగా 
జీవింతును నీ కోసమే 
ఆశ్రయమైన నా యేసయ్యా    
                                                  " అతి పరిశుద్ధుడా " 
సర్వోన్నతమైన స్థలముల యందు 
నీ మహిమ వివరింపగా 
ఉన్నతమైన నీ సంకల్పము 
ఎన్నడూ ఆశ్చర్యమే 
ముందెన్నడూ చవి చూడని 
సరిక్రొత్తదైన ప్రేమా మృతం 
నీలోనే దాచావు ఈనాటికై 
నీ ఋణము తీరదు ఏనాటికీ.        " అతి పరిశుద్ధుడా " 

సద్గుణ రాశి నీ జాడలను 
నా ఎదుటే నుంచుకొని 
గడిచిన కాలం సాగిన పయనం 
నీ కృపకు సంకేతమే
కృప వెంబడి కృప పొందగా 
మారాను మధురముగా నే పొందగా 
నాలోన ఏ మంచి చూశావయ్యా 
నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా  " అతి పరిశుద్ధుడా " 

సారెపై నున్న పాత్రగ నన్ను 
చేజారి పోనియ్యక  
శోధనలెన్నో  ఎదిరించినను
నను సోలి పోనియ్యక  
ఉన్నావులే ప్రతి క్షణమునా 
కలిసున్నావులె ప్రతి అడుగునా  
నీవేగా యేసయ్య నా ఊపిరి  
నీవేగా యేసయ్యా నా కాపరి         " అతి పరిశుద్ధుడా " 



Comments

Popular Posts