ఎన్నాళ్ళో ఉండవమ్మా - ennallo undavamma song lyrics

ఎన్నాళ్ళో ఉండవమ్మా నీ కంటి లోని కన్నీళ్లు 
కొన్నాల్లే ఓర్చుకుంటే  .. 
నీ ఇంట కురియు పన్నీరు  (2)
నీ శ్రమను ఏరిగియున్న దేవుడు 
ఏ క్షణము నిను విడిచి పెట్టడు 
ఒంటరివి కావు నీవు ఎన్నడూ            " ఎన్నాళ్ళో " 

ఫలము దొరకక  మనస్సు గాయ మాయెనా 
గతపు భయము తొలగక - బలము వీగి పోయెనా 
ఓటమి చీకటై నిన్ను కమ్మి వేసినా (2)
తేలిక చేయును ... 
తేలిక చేయును భారం ఏదైనా 
ధైర్యం నీ యందు కలిగించకుండునా  " ఎన్నాల్లో " 

స్వరము శృతిలో పలుకక గలము మూగ  బోయిన 
పదము సరిగ కుదరక  కలము జారి పోయినా 
ప్రశ్న లు తీవ్రమై నిన్ను కూల ద్రోసినా (2)
సాధ్యము చేయును ... 
సాధ్యము చేయును కార్యము ఏదైనా 
గీతం నీ నోట పలికించకుండునా      " ఎన్నాళ్ళో "

ఎవరు పలకరించక బ్రతుకు ఘోర మాయెనా 
అడుగు సహకరించక పరుగు ఆగి పోయినా 
ఆశలు శూన్యమై నిను క్రుంగ దీసెనా (2)
తిన్నగా చేయును ...
తిన్నగా చయును మార్గము ఏదైనా 
గమ్యము నీ ముందు కనిపోయించ కుండునా                                                                      "ఎన్నాళ్ళో" 


 

Comments

Popular Posts