ధవలవర్ణుడా నా ప్రాణప్రియుడా - dhavalavarnuda naa prana priyuda song lyrics
ధవలవర్ణుడా నా ప్రాణ ప్రియుడా
వర్ణనకందని అతిశ్రేష్ఠుడా
ఆరాధింతును నిను మనసారా
అత్యున్నతమైన కృప పొంద (2)
అతి కాంక్ష నీయుడు నా యేసయ్య (2) " ధవళ "
అలజడి రేగిన నా నావలో
నీ శాంతి నే చూచితిని
అవమానము లో అండగ నిలిచిన
ఆశ్రయుడవు నీవయ్య
పరిమలింప చేసితివి నీ స్నేహ బంధం
విలువైన నీ త్యాగముతో
చేరాను నీ దరి నీ ప్రేమ కోరి
నిను విడిచి నేనుండలేను (2) " ధవళ "
నిలకడ లేని నా హృదిలో
నీ వాక్యమే స్థిర పరచెను
నిందల పర్వములో నా తోడు నిలిచిన
నా ధైర్యం నీవయ్య
పదిలమైతిని నీ మదిలో నేను
పరిశుద్ధుడా నా యేసయ్య
చేరాను నీ దరి నీ ప్రేమ కోరి
నిను విడచి నేనుండలేను (2) " ధవళ "
శిథిలము కాని సుందర నగరములో
నీతో నేను జీవుంతును
స్తుతి గానాలతో నిను కీర్తించుటయే
నా జీవిత భాగ్యము
స్థాపించి యున్నావు నా కొరకే నీవు
నిత్య సీయోనును
చేరాను నీ దరిని నీ ప్రేమ కోరి
నిను విడిచి నేనుండలేను " ధవళ "
Comments
9949999767