వందనంబొనర్తుమో ప్రభో ప్రభో - vandhanambo narthumo prabho prabho song lyrics
వందనంబొనర్తుమో ప్రభో ప్రభో
వందనంబొనర్తుమో ప్రభో ప్రభో
వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా (2)
వందనంబు నొర్తుమో మో ప్రభో (2)
ఇన్ని నాళ్లు ధరను మమ్ము బ్రోచియు
కన్నతండ్రి మించి యెపుడు గాచియు (2)
ఎన్న లేని దీవెనలిడు నన్న యేసువా
యన్ని రెట్లు స్తోత్రములివిగో (2) " వందనంబు "
ప్రాత వత్సరంబు బాప మంతయు
భీతిని మన్నించి మమ్ము గావుము (2)
నూతనాబ్దమునదు నీదు నీతి నొసఁగుమా
దాత క్రీస్తు నాథ రక్షకా (2) " వందనంబు "
దేవ మాదు కాలు సేతు లెల్లను
సేవ కాలి తనువు దినములన్నియు (2)
నీవొసంగు వెండి పసిడి జ్ఞానమంతనీ
సేవకై అంగీకరించుమా (2) " వందనంబు "
కోత కొరకు దాస జనము నంపుము
ఈ తరి మా లోటు పాట్లు తీర్చుము (2)
పాతకంబు లెల్ల మాపి భీతి బాపుము
ఖ్యాతి నొందు నీతి సూర్యుడా (2) " వందనంబు "
మా సభలను పెద్ద చేసి పెంచుము
ఈ తరి మా లోటు పాట్లు తీర్చుము (2)
మోసపుచ్చు నంధ కార మంత ద్రోయుము
యేసు కృపన్ కుమ్మరించుము (2) " వందనంబు "
Comments