శతకోటి వందనాలు - shathakoti vandhanalu song lyrics

శతకోటి వందనాలు నా యేసయ్య 
గతమంతా నీ కృపలో కాచితివయ్యా  (2)

నూతన బలము నూతన శక్తి మా కొసగుమయ్యా 
ఎనలేని నీ ప్రేమని మాపై చూపించావయ్యా  (2)
                                     " శతకోటి " 
చరణం 1 : 
శ్రమలు శోధనలు ఇరుకు ఇబ్బందులు 
ఎన్నెన్నో కలిగి కన్నీరు విడిచిన (2)
కన్నీరు నాట్యముగ మార్చి వేసినావు 
మా తోడు నీవై నడిపించినావు (2)
                                     " నూతన "

చరణం 2 : 
ఆత్మీయ యాత్రలో అలసి పోయినా 
నీ శక్తితో నింపి బలపరచినావు (2)
పక్షి రాజు వలే నన్ను  పైకెగరజేసి  
ఆకాశ వీధిలో విహరింప జేశావు (2)  
                                    " నూతన " 

చరణం 3 : 
దినములు జరిగించుచుండగా 
నీ కార్యములు నూతన పరచుము నా యేసయ్య (2) 
ఈ సమయములో మెండైన దీవెనలు  
కురిపించుమయా కృప గల దేవా  (2)
                                   " నూతన "         

 

Comments

Popular Posts