రారాజు పుట్టాడోయ్ - raraju puttadoy song lyrics

రారాజు పుట్టాడోయ్ మారాజు పుట్టాడోయ్ 
సూడంగా రారండోయ్ వేడంగా రారండోయ్  
ఈ లోకమునకు రక్షకుడిక పుట్టినాడండోయ్ 
మన కొరకు దేవ దేవుడు దిగి వచ్చి నాడండోయ్ 
నింగి నేల పొంగి పోయే - ఆ తార వెలిసి మురిసి పోయే 
సంబర మాయెనే హోయ్ ... 

1) వెన్నెల వెలుగుల్లో పూసెను సలిమంట  
ఊరు వాడ వింతబోయే గొల్లల సవ్వడులు 

కన్నుల విందుగా  దూతలు పాడగా 
సందడే సిందేయంగా మిన్నుల పండుగ  

సుక్కల్లో సంద్రుడల్లే  సూడ సక్క నోడంట 
పశువుల పాకలోన ఆ పసి బాలుడంట 
చెరగని స్నేహమై .. 


2) మచ్చలేని ముత్యమల్లే పొడిచే సూరీడు 
మనసులో దీపమై దారి చూపే దేవుడు 
ప్రేమ పొంగు సంద్ర మల్లే కంటికి రెప్పలా 
అందరికి తోడు నీడై మాయని మమత లా 

సల్లంగ సూడ యేసు ఇల వచ్చినాడంట 
పరముగ చేరు యేసు  పరమును వీడెనంట 
మరువని బంధమై ..  

Comments

Popular Posts