నూతన పరచుము దేవా - nuthana parachumu deva song lyrics

నూతన పరచుము దేవా - నీ కార్యములు నా యెడల (2)
సంవత్సరాలెన్నో జరుగుచున్నను 
నూతన పరచుము నా సమస్తము (2)
పాతవి గతించి పోవును - సమస్తము నూతనమగును 
నీలో ఉత్సహించుచు - నీకై ఎదురు చూతును (2)
                                             " నూతన "

శాశ్వతమైనది నీదు ప్రేమ 
ఎన్నడైన మారనిది నీదు ప్రేమ (2)
దినములు గడిచినా సంవత్సరాలెన్నో దొర్లినా  
నా యెడ నీదు ప్రేమ నిత్యం నూతనమే (2)
                                           " పాతవి " 
ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో 
నన్ను ఎదుర్కొందువు  నీదు కరుణతో (2)
తరములలో ఇలా సంతోష కారణముగా 
నన్నిల చేసినావు నీకే స్తోత్రము (2) 
                                          " పాతవి " 


Comments

Popular Posts