నా దేవుడే నాకు - naa devude naku song lyrics

నా దేవుడే నాకు ప్రాణ స్నేహితుడు  
నా దేవుడే నాకు మార్గ దర్శకుడు 
నా దేవుడే నాకు నిత్య పోషకుడు 
నా దేవుడే నాకు జీవనదాయకుడు 
గతిలేని నన్ను వెదకినా అతికాంక్షనీయుడాయెనే 
మితి లేని ప్రేమ చూపిన రవి కోటి తేజుడాయెనే
 
చరణం 1 : 
శ్రమలలో నా తోడుగా నన్ను నడిపించెను 
నా నీడగా వెన్నంటియున్న నా ప్రాణ నాథుడు 
మరణపు సంకెళ్ళనుండి నన్ను విడిపించెను 
నా బంధకాలన్ని తెంచివేసిన నా నీతి సూర్యుడు 

క్షణమైన మరువని వీడని నా ప్రేమ శిఖరము 
క్షమియించి నాకు అందించెను  ఈ రక్షణానందము 
క్షయ యైన బ్రతుకు మార్చి  అక్షయత నొసగెను 
                                             " గతిలేని "

చరణం 2 : 
వాక్యమే నా జీవమై నన్ను బ్రతికించెను  
నా పాదములకు చిరు దీపమైన నా దివ్య తేజము  
ఆత్మయే పరి పూర్ణమై నన్నుబలపరిచెను 
నా అడుగు జాడలను స్థిరము చేసిన 
నా జీవ మార్గము 

నా గమ్యమేమి టో తెలియక నా పరుగు ఆగిపోగా 
నా చేయి పట్టి నను నడిపిన నా మార్గ దర్శి యేసే 
విలువైన ప్రేమ నాపై నిలువెల్ల కురిసెను 
                                            " గతిలేని "

.

Comments

Popular Posts